విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా... గాజువాకలో తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజుకు చేరింది. శ్రీనివాసరావు సతీమణి లావణ్య, పిల్లలు దీక్షా శిబిరానికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అభిమానుల అండతో ఆయన ఆరోగ్యం బాగుండాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు ఆయన సతీమణి తెలిపారు. తెదేపా అగ్ర నేత అశోక్ గజపతి రాజు సహా చాలా మంది నాయకులు పల్లా శ్రీనివాస్ కు సంఘీభావం తెలిపారు.
ఇదీ చదవండి: