విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్ల స్థలాలు ఎంపిక, పంపిణీపై అలసత్వం తగదని హెచ్చరించారు. ఇప్పటికే 13 సార్లు రెవిన్యూ సిబ్బందిని వివరాలు అడిగినా తాత్సారం చేయడం తగదన్నారు. వెంటనే ఇళ్ల స్థలాలు గుర్తించి పంపిణీ చేయాలని పేర్కొన్నారు. లేకపోతే సర్వేయర్లను సస్పెండ్ చేసి తహసీల్దారులను సరెండర్ చేస్తామని హెచ్చరించారు. క్వారెంటైన్ కేంద్రాలలో సక్రమమైన భోజనం పెట్టాలని అధికారులకు తెలియజేశారు. భోజన వసతి కోసం ఆశ్రమ పాఠశాలలు వినియోగించుకోవాలని వీడియో కాన్ఫరెన్స్లో చెప్పారు.
ఇదీ చదవండి :