పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి డీకే బాలాజీకి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దంపతులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. విశాఖ ఏజెన్సీలో మూడేళ్లుగా సబ్ కలెక్టర్గా విధుల్లో చేరి ఐటీడీఏ పీవోగా పదోన్నతి పొంది విశేష సేవలు అందించారని పాడేరు ఎమ్మెల్యే తెలిపారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి తనదైన కృషి చేశారని కొనియాడారు. గిరిజన ప్రజా శ్రేయస్సే పరమావధిగా భావించి విధులు నిర్వర్తించారని చెప్పారు. అనంతరం ఐటీడీఏ పీవో విధి నిర్వహణలో తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
![paderu itda po honoured by mla bhagyalaxmi and his husband](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-vsp-78-30-po-mla-ghana-veedkolu-paderu-ap10082_30042020202141_3004f_1588258301_273.jpg)
ఇదీ చదవండి :