ETV Bharat / state

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆన్​లైన్ తరగతులు ప్రారంభం - ఆన్​లైన్​ తరగతులు వార్తుల

విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఆన్​లైన్ తరగతులు ప్రారంభమైనట్లు వృత్తి విద్యాశాఖాధికారి పి. సోమరాజు తెలిపారు.

online classes starts in govt. junior college
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రారంభమైన ఆన్​లైన్ తరగతులు
author img

By

Published : Aug 11, 2020, 4:50 PM IST

విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ జానియర్ కళాశాలల విద్యార్థులకు ఆన్​లైన్ బోధన ప్రారంభమైంది. జూమ్ యాప్ ద్వారా అధ్యాపకులు పాఠాలు బోధిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ విద్యా సంవత్సరంలో కళాశాలలు తెరవలేని పరిస్థితి రావటంతో... ప్రభుత్వం చొరవ తీసుకుని విద్యార్థులకు ఆన్​లైన్​లో తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో చోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆన్​లైన్​లో బోధన చేస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. వైవీఎల్ అన్నపూర్ణ తెలిపారు. జిల్లాలో 39 ప్రభుత్వ జునియర్ కళాశాలలో ఆన్​లైన్ బోధన జరుగుతుందని జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి పి.సోమరాజు వెల్లడించారు.

ఇదీ చదవండి: అనకాపల్లిలో 800కు చేరిన కరోనా కేసుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.