విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో మరొక వ్యక్తి మృతి చెందారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ సమీపంలో నివాసముంటున్న గంగాధర్.. సంఘటన తర్వాత విజయనగరం జిల్లా కొత్తవలసలోని తన బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో చింతలపాలెం చెక్ పోస్ట్ వద్ద అస్వస్థతకు గురయ్యారు.
అపస్మారక స్థితిలో పడి ఉన్న గంగాధర్‌ను గుర్తించిన కానిస్టేబుల్.. కొత్తవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. చికిత్స పొందుతూ గంగాధర్ మృతి చెందారు.
ఇవీ చదవండి:
లైవ్ అప్డేట్స్ : విశాఖ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం.. సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్