ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా... మరొకరు గాయాలపాలయ్యాడు. విశాఖ జిల్లా నాతవరం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గునుపూడి గ్రామానికి చెందిన నిండుగొండ రాజు (29), బోసి ప్రసన్నకుమార్ ఇద్దరూ ద్విచక్ర వాహనంపై నర్సీపట్నంలో ఓ కార్యక్రమానికి హాజరై... స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. నాతవరం రెండో కిలోమీటరు మలుపు వద్దకు వచ్చే సమయానికి వేగంగా ప్రయాణిస్తూ టేకు చెట్టును ఢీకొట్టి పడిపోయారు. డ్రైవింగ్ చేస్తున్న రాజు తీవ్రంగా గాయపడి కొంతసేపటికే మృతి చెందగా, ప్రసన్నకుమార్‌కు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రమేష్ తెలిపారు.
కుమారుడు పుట్టిన నాలుగు నెలలకే: రాజు ఇటీవల ప్రేమించి వివాహం చేసుకున్నాడనీ.. ఇతనికి నాలుగో నెల కుమారుడున్నట్టు గ్రామస్థులు తెలిపారు. ప్రేమ వివాహంతో పుట్టింటికి దూరమయ్యానని, ఇప్పుడు కట్టుకున్న భర్త దూరమవడంతో రాజు భార్య కన్నీరుమున్నీరవుతోంది. తనకు ఉన్న ఒక్క ఆధారమూ లేకుండా పోయిందని రోధిస్తోంది.
ఇదీ చదవండి: