విశాఖ జిల్లా పాడేరులో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దాసరిపుట్టు గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్ (22)అనే యువకుడు మృతి చెందగా.. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఇంటి పన్నుల పెంపు రద్దు చేయాలని నిరసన..