విశాఖలో దారుణం జరిగింది. డబ్బు, బంగారం కోసం దుండగులు ఓ వృద్ధురాలిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. పూర్ణమార్కెట్ దుర్గాలమ్మ గుడి సమీపంలోని పిరికి వీధిలో నల్లి అచ్చిమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. ఒంటరిగా ఉండటాన్ని గమనించిన దుండగులు ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి మెడకు తాడు బిగించి హతమార్చారు. అనంతరం ఇంట్లో ఉన్న నగదు, బంగారం దోచుకెళ్లినట్టు అనుమానిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: