లాక్‌డౌన్ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఓ పరిశ్రమ యథావిధిగా పనులు కొనసాగిస్తోంది. విశాఖ జిల్లా రోలుగుంటలో 'ఓలమ్ ఆగ్రో' అనే జీడి పిక్కల కర్మాగారాన్ని మూసివేయకుండానే కార్మికులతో.. యాజమాన్యం పనులు చేయిస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానిక సచివాలయ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, నాయకులు, యువకులు, గ్రామ వాలంటీర్లు వెళ్లి.. యాజమాన్యాన్ని ప్రశ్నించారు. పరిశ్రమలోకి వెళ్లి.. అక్కడ పని చేస్తున్న మహిళా కార్మికులను ఇళ్లకు పంపించేశారు. మూసివేయకపోతే అధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: