ETV Bharat / state

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన... రహదారి ఆక్రమణకు అడ్డుకట్ట - మన్యంలో పాత రహదారి కబ్జా వార్తలు

విశాఖ మన్యంలోని ఓ పాత రహదారిని కబ్జాదారుల చెర నుంచి ఈటీవీ భారత్​ కాపాడింది. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా చూడాలన్న గిరిజనుల ఆవేదనపై ఈటీవీ భారత్​ కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన అధికారులు... ఆ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

Road occupation in vishaka agency
Road occupation in vishaka agency
author img

By

Published : Aug 8, 2020, 12:02 AM IST

విశాఖ మన్యంలో భూ కబ్జాపై ఈటీవీ భారత్​లో ప్రచురితమైన 'రహదారిపై వైకాపా నేత కన్ను... రాత్రికి రాత్రే చదును' అనే కథనానికి అధికారులు స్పందించారు. ఈ స్థలాన్ని ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.

హుకుంపేట మండలం అరకు-పాడేరు ప్రధాన పాత ఆర్ అండ్ బీ రహదారిని హుకుంపేటకు చెందిన ఓ వైకాపా నాయకుడు గత నెల రోజులుగా జేసీబీ ద్వారా చదును చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని గిరిజనులు ఆరోపిస్తున్నారు.​ పాడేరు నుంచి అరకు వెళ్లే రహదారి పక్కన ఉన్న ఈ ప్రాంతం... ప్రస్తుతం నిరుపయోగంగా ఉండటంతో ఆక్రమించేందుకు యత్నించారని చెప్పారు. నెలరోజులుగా తాము ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు స్పందించలేదని... ఈటీవీ, ఈటీవీ భారత్​ కథనాలతో అధికారులు దిగి వచ్చారని కొట్నాపల్లి, పెదగరువు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.