విశాఖపట్టణం జిల్లా అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది నిరసనకు దిగారు. కరోనా సమయంలో పనిచేస్తున్న తమకు రక్షణ పరికరాలు, బీమా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు చేశారు. కరోనా రోగులను ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నామని, వారికి కావలసిన మందులు, ఆహారం, ఇతర సదుపాయాలను అందించడానికి వార్డ్లోకి వెళ్తున్న తమకు ఎలాంటి రక్షణ పరికరాలు అందించడంలేదని వాపోయారు. కరోనా విధులు నిర్వహించి మృతి చెందిన వైద్యసిబ్బందికి ప్రభుత్వం రూ.50లక్షలు ప్రకటించిందని... ఆ సిబ్బంది పరిధిలో శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం విచారకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు.
ఇవీ చదవండి: