ETV Bharat / state

ఎన్టీఆర్​ ఆసుపత్రిలో గత నాలుగు రోజులుగా నిలిచిన కరోనా పరీక్షలు

author img

By

Published : Jul 18, 2020, 12:29 AM IST

గత నాలుగు రోజులుగా అనకాపల్లి ఎన్టీఆర్​ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిలిచిపోయాయి. ట్రూనాట్​ పరీక్ష చేసేందుకు కావలసిన కిట్​ సరఫరా లేకపోవడం వల్ల పరీక్షలు నిలిపివేశారు. దీంతో అక్కడ పరీక్షలు జరగవలసిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ntr hospial in anakapalle not doing corona test from past four days
అనకాపల్లిలో నిలిచిన కరోనా పరీక్షలు

విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్​ ఆసుపత్రిలో కరోనా పరీక్ష గత నాలుగు రోజులుగా నిలిచిపోయాయి. అనకాపల్లితో పాటు చుట్టు పక్కల పరిసర ప్రాంతాలకు చెందిన 80 మందికి కిట్ ద్వారా పరీక్ష చేసి కరోనా నిర్ధరించాల్సి ఉంది. కిట్​లు లేక పరీక్షలు జరగడం లేదు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్​ డాక్టర్​ శ్రావణ్​ కుమార్​ని వివరణ కోరగా... శనివారం నుంచి పరీక్షలు చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు 147 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. 73 మంది కోలుకుని డిశ్చార్జ్​ అయ్యారు. మిగిలిన వారిని క్వారంటైన్​ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి :

ఇలా అయితే లేని కరోనా వచ్చేటట్లు ఉంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.