రాబోయే రోజుల్లో విశాఖ జిల్లాలోని సీలేరు కాంప్లెక్స్‌లో విద్యుదుత్పత్తికి నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ జెన్‌కో పర్యవేక్షక ఇంజినీర్ సీహెచ్ రామకోటిలింగేశ్వరరావు తెలిపారు. జూన్ నెలాఖరుతో నీటి సంవత్సరం ముగిసిందని తెలిపారు. నీటిసంవత్సరం ముగిసే సమయానికి 28 టీఎంసీల నీరు బలిమెల, జోలాపుట్ జలాశయంలో ఉందని రామకోటిలింగేశ్వరరావు తెలిపారు. ఇందులో ఏపీ జెన్‌కో వాటాగా 0.55 టీఎంసీలు నీరుండగా, సీలేరు, డొంకరాయిలో 10.25 టీఎంసీలు నీరుందని వెల్లడించారు. దీంతో రాబోయే రోజుల్లో విద్యుదుత్పత్తికి ఎటువంటి ఇబ్బందులుండవని స్పష్టం చేశారు. వర్షాలూ పడుతుండటంతో నీటి నిల్వలు నెమ్మదిగా చేరుతున్నాయని ఇంజినీరు సీహెచ్ రామకోటిలింగేశ్వరరావు తెలిపారు.
ఇదీ చదవండి: 'నిర్లక్ష్యం.. అవినీతి మయం.. కక్షపూరితం.. వెరసి వైకాపా పాలన'