విశాఖ జిల్లా రోలుగుంట మండలం పడాల పాలెం, లగుడు కొత్తూరు గ్రామాల మధ్య వంతెన నిర్మాణం పాలకుల హామీలకే పరిమితమైంది. ఫలితంగా ఈ గ్రామాల ప్రజలు వ్యవస్థలతో కుస్తీ పడుతున్నారు. వాస్తవానికి పంచాయతీ కేంద్రమైన జగ్గంపేట చేరుకోవాలంటే మామూలు రోజుల్లో రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే సరిపోతుంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో ఈ రెండు గ్రామాల మధ్య సర్పానది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
దీనిలో భాగంగానే పడాల పాలెం గ్రామ వలంటీర్లు రోజు సచివాలయంలో హాజరు వేయించుకోవడానికి వెళ్లడంతో పాటు వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి వెళ్లాల్సి ఉంటుంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సర్ప నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనివల్ల రోజూ ప్రాణాలకు తెగించి వాలంటీర్లు గడ్డ దాటాల్సి వస్తోంది. పాలకులు ఎప్పటికైనా తమ సమస్యలను పరిగణనలోకి తీసుకుని రెండు గ్రామాల మధ్య వంతెన నిర్మిచాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: రూ.12 కోట్లకు టోకరా వేసిన నూతన్ నాయుడు?