విశాఖ జిల్లాలో భూ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్న తెదేపా నేతలు విశాఖలో పర్యటించారు. పార్టీ ఏర్పాటు చేసిన నిజ నిర్థరణ కమిటీ సభ్యులు.. ప్రజలకు తమ దృష్టికి వచ్చిన విషయాలు వెల్లడించారు. జిల్లాలో వైకాపా నేతలు భూ దందా చేస్తున్నారని ఎమ్మెల్యే నిమ్మల ఆరోపించారు. ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి విజయసాయిరెడ్డికి బినామీగా ఉన్నారని.. భీమిలి పరిసరాల్లో 650 ఎకరాలు కబ్జా చేశారని తెలిపారు. రూ.300 కోట్ల విదేశీ ధనాన్ని పెట్టుబడిగా మార్చుకున్నారని విమర్శించారు. సూట్ కేసు కంపెనీలతో విజయసాయిరెడ్డి భూములు కొనుగోలు చేయించారని ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి: