ETV Bharat / state

కిడారి హత్య కేసులో అనుబంధ అభియోగపత్రం దాఖలు - Kidari Murder case

మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ హత్య కేసుకు సంబంధించి అనుబంధ అభియోగ పత్రాన్ని ఎన్‌ఐఏ అధికారులు కోర్టులో సమర్పించారు. ఈ హత్యలో వంతల ధర్మయ్య కీలక పాత్ర పోషించారని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న ఎన్‌ఐఏ అధికారులు... మావోయిస్టు సానుభూతిపరుడిగా వ్యవహరిస్తూ కిడారికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి చేరవేసేవాడని తెలిపారు.

కిడారి హత్య కేసులో అనుబంధ అభియోగపత్రం దాఖలు
author img

By

Published : Jul 13, 2019, 7:40 AM IST

మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ హత్య కేసులో నిందితులుగా ఉన్న మావోయిస్టులతో... ధర్మయ్యకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఎన్‌ఐఏ కోర్టులో అధికారులు అనుబంధ అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. ఈ కేసులో గతంలోనే ఎన్ఐఏ ప్రాథమిక అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. అందులో డుంబ్రిగూడ గ్రామానికి చెందిన యేళ్ల సుబ్బారావు, శోభన్​లతోపాటు మావోయిస్టు వెంకట రవి చైతన్య, అరుణ, శీను బాబు అలియాస్ రైనో, స్వరూప సుదర్శన్​లను నిందితులుగా పేర్కొంది. దర్యాప్తులో భాగంగా జనవరి 16న ధర్మయ్యను అరెస్టు చేశారు. మావోయిస్టులకు అవసరమైన సామగ్రిని ధర్మయ్య సరఫరా చేసేవారని ఎన్‌ఐఏ అధికారులు నిర్ధారించారు.

ఇదీ చదవండీ...

బడ్జెట్‌లో చిత్తూరు జిల్లాకు తగ్గిన ప్రాధాన్యం..!?

Intro:ap_knl_31_12_varuna_yagam_av_AP10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీసీతా రామాంజనేయస్వామి దేవాలయములో రెండో రోజు వరుణ యాగం శ్యాస్త్రో క్తంగా నిర్వహించారు. ఆవాహిత దేవత పూజ, హోమం, జల పూజ నిర్వహించి వరుణుడి హారతి ఇచ్చారు.సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.

Body:వరుణ

Conclusion:యాగం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.