రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులు అంశానికి ఏపీ ఎన్జీవో సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. విశాఖలో పర్యటించిన ఆయన ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఇవాళ ఎపీ ఎన్జీవో రాష్ట్ర కార్యాలయానికి సంబంధించి భవనాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలిస్తే.. ఉద్యోగుల కోసం ఆలోచించాలని కోరారు. అమరావతిలో ఇచ్చిన తరహాలోనే నివాస సహకారంగా అలవెన్సులు ఇవ్వాలని కోరారు.
ఇవీ చూడండి...