భారతీయ రైల్వే అక్టోబర్ 1 నుంచి పలు ప్రత్యేక రైళ్లకు కొత్త స్టేజీల్లో నిలుపుదలను ప్రకటించింది. ప్రయాణీకుల సౌకర్యార్ధం రైళ్ల దూరాన్నీ పొడిగించింది. తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని పలు ప్రత్యేక రైళ్లకు అదనపు స్టాపేజీలు ఏర్పాటు చేసింది. ముంబై-భువనేశ్వర్, ముంబై-కోనార్క్ ఎక్స్ ప్రెస్‌కి బ్రహ్మపూర్, ఛత్రపూర్, బవుల్గాంలు అదనపు స్టాపేజీలుగా కేటాయించింది. సికింద్రాబాద్ - హౌరా- సికింద్రాబాద్, గువాహటి - బెంగళూరు- గువాహాటి ట్రైవీక్లీ రైళ్లు బవుల్గాం, బ్రహ్మపూర్‌లో అదనపు స్టాపేజీలుగా గుర్తించింది.
ఇవే అదనపు స్టేజీలు..
హౌరా - తిరుచ్చిరాపల్లి, హౌరా బై వీక్లీ రైళ్లు బ్రహ్మపూర్‌లో ఆగనున్నాయి. ఖుర్దారోడ్- అహ్మదాబాద్, ఖుర్డారోడ్ స్పెషల్ కాలుపడఘాట్, బవుల్గాం, కాళీఖోటి, ఛత్రపూర్, బ్రహ్మపూర్ స్టేజీల్లో రైళ్లు ఆగనున్నాయి. ఖుర్డారోడ్- ఓఖా- ఖుర్డారోడ్ ప్రత్యేక రైలు బవుల్గాం, ఛత్రపూర్‌లో నిలుపుదల కానుంది. గాంధీగ్రాం- ఖుర్దరోడ్- గాంధీగ్రాం స్పెషల్ బవుల్గాం, ఛత్రపూర్, మునిగుడలు అదనపు స్టేషన్లుగా రైల్వే గుర్తించింది. విశాఖపట్నం -కోర్బా- విశాఖ ప్రత్యేక రైలు మునిగుడ, హరిశంకర్ రోడ్‌ల్లో అదనపు స్టాపేజీలుగా నిలవనుంది.
పొడిగింపు రైళ్లు..
ఇప్పటి వరకు ఖుర్డారోడ్ వరకే పరిమితమైన రైళ్లను ఇకపై పూరీ వరకు నడపనున్నారు. ఖుర్డారోడ్- అహ్మదాబాద్ ప్రత్యేక రైలు, భువనేశ్వర్- అహ్మదాబాద్- భువనేశ్వర్, పూరీ వరకు పొడిగించారు. ఖుర్దారోడ్- ఓఖా- ఖుర్డారోడ్ స్పెషల్ రైలును పూరీ వరకు పొడిగించారు. అక్టోబర్ ఒకటి నుంచి కొత్త స్టాపేజీలు అమల్లోకి వస్తాయని తూర్పు కోస్తా రైల్వే వివరించింది.