ETV Bharat / state

గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా.. పక్కా ప్రణాళిక - New rules to HP gas cylinder supply at visakha news

గ్యాస్ సిలిండర్ల సరఫరా పక్కదారి పట్టకుండా ఏజెన్సీ నిర్వాహకులు కొత్త విధానం అమలు చేస్తున్నారు. గ్యాస్​ బుక్ చేసుకున్న వినియోగదారుడికి ఓటీపీ వచ్చేలా చూస్తున్నారు.

New rules to HP gas cylinder supply
హెచ్.పీ గ్యాస్ సిలిండర్ సరఫరాలో కొత్త విధానం
author img

By

Published : Sep 29, 2020, 12:07 PM IST

హెచ్​పీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కొత్త విధానం అమల్లోకి తెచ్చారు ఏజెన్సీ నిర్వాహకులు. గ్యాస్​ సిలిండర్లు పక్కదారి పట్టకుండా ఉండేందుకు బుక్ చేసుకున్న వినియోగదారుడికి మాత్రమే సిలిండర్ అందేలా నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన నిర్వాహకులు ఈ నూతన విధాన వివరాలను వెల్లడించారు. గ్యాస్ వినియోగదారులు 9666023456 టోల్ ఫ్రీ ఐవీఆర్ఎస్ ఫోన్ నెంబర్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకోవాలన్నారు. దీంతో వినియోగదారుడికి ఓటిపి వస్తుందని తద్వారా ఇంటికి వచ్చే డెలివరీ బాయ్​కి ఓటీపీ నెంబర్​ చెబితే సిలిండర్ సరఫరా అయ్యేటట్టు ఆన్​లైన్ నమోదవుతుందని పేర్కొన్నారు. దీని ద్వారా ప్రభుత్వం అందించే సబ్సిడీ సైతం తక్షణమే బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని వెల్లడించారు. ఈ విధానాన్ని నర్సీపట్నం డివిజన్ పరిధిలో రావికమతం, రోలుగుంట, మాకవరపాలెం, నాతవరం తదితర ప్రాంతాలకు తెలియజేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

ఇవీ చూడండి...

భగత్ సింగ్ జయంతి.. విశాఖలో రక్తదాన శిబిరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.