గెటాక్స్ నేచురల్ సంస్ధ సహజ 'రెడ్ చిల్లి ఐస్ క్రీం'ను మార్కెట్లోకి విడుదల చేసింది. విశాఖలో బాలీవుడ్ నటి, మోడల్ అద్రిజా ఈ ఐస్ క్రీంను మార్కెట్లో పరిచయం చేశారు.సహజ ఉత్పత్తిగా ఈ ఐస్ క్రీం ఎంతో మధురంగా ఉందన్నారు.
తమ సొంత డెయిరీల ద్వారా సేకరించిన ఉత్పత్తులతో తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసిన ఐస్ క్రీంలు, మిల్క్ షేక్‌లు పోషకాలతో వినియోగదార్లను ఆకట్టుకుంటున్నాయని ఆ సంస్ధ సీఈవో సురేశ్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖతో పాటు కోస్తా జిల్లాల్లో మొత్తం 14 స్టోర్లు ఉన్నాయని.. వాటి సంఖ్య 50కి పెంచనున్నట్లు తెలిపారు. తమ ఉత్పత్తులను త్వరలో విదేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు ఆయన వివరించారు.
ఇదీ చూడండి: తెదేపా ఎమ్మెల్యే వెలగపూడికి వైకాపా ఎమ్మెల్యే సవాల్