విశాఖలో 2019 జాతీయ బహుభాషా నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రసజ్ఞ సంస్థ ఆధ్వర్యంలో నాలుగురోజుల పాటు నాటకాల ప్రదర్శనలు కళాభారతి ఆడిటోరియంలో జరుగుతాయి. తొలి రోజున సుప్రసిద్ధ రచయిత చలం రాసిన మైదానం తెలుగు నాటకాన్ని తెలంగాణకి చెందిన సమాహార థియేటర్ గ్రూప్ నశ్రిన్ ఇస్సాక్ దర్శకత్వంలో ప్రదర్శించారు. మధ్యప్రదేశ్‌కి చెందిన బర్బరీక్ బెహగలీ నాటకం కూడా ప్రదర్శించారు. ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తికరంగా ఈ నాటకాలను తిలకించారు.
ఇదీ చదవండి: