విశాఖ జిల్లా నర్సీపట్నం ఏఎస్పీ తూహన్ సిన్హా సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజలకు పలు సూచనుల చేశారు. సబ్ డివిజన్‌కు సంబంధించి గ్రామాల్లో కోడిపందాలు నిర్వహించొద్దని ఆయన పిలుపినిచ్చారు. జూదం, కోడి పందేలు, నాటు సారా తయారీ విక్రయాలు వంటి కార్యకలాపాల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
ఇప్పటికే పలువురు అనుమానితుల పై బైండోవర్ నమోదు చేశామని పేర్కొన్నారు. జనం ఇళ్ల వద్దే ఉండి కరోనా నిబంధనలు పాటిస్తూ సంక్రాంతి పండుగను జరుపుకోవాలని కోరారు.
ఇదీ చూడండి. అప్రమత్తంగా లేకుంటే జేబుకు చిల్లే...!