ETV Bharat / state

స్వచ్ఛ సర్వేక్షణ్​లో సత్తా చాటిన 'నర్సీపట్నం' మున్సిపాలిటీ - విశాఖ జిల్లా వార్తలు

స్వచ్ఛ సర్వేక్షన్-2020 పోటీల్లో విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ మరోసారి సత్తా చాటింది. 50 వేల నుంచి లక్ష లోపు జనాభా కలిగిన విభాగంలో నర్సీపట్నం 28వ ర్యాంకు దక్కించుకొని మరోసారి గుర్తింపు తెచ్చుకుంది.

Narsipatnam Municipality
నర్సీపట్నం మున్సిపాలిటీ
author img

By

Published : Aug 21, 2020, 9:47 AM IST

స్వచ్ఛ సర్వేక్షన్-2020 పోటీల్లో విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక సంఘం మరోసారి సత్తా చాటింది. దక్షిణ భారతదేశ స్థాయిలో విశేషమైన ర్యాంకును దక్కించుకుంది. ఈ సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం గురువారం మున్సిపాలిటీలకు ర్యాంకులను ప్రకటించింది. దీనిలో భాగంగానే.... 50 వేల నుంచి లక్ష లోపు జనాభా కలిగిన విభాగంలో నర్సీపట్నం 28వ ర్యాంకు దక్కించుకొని మరోసారి గుర్తింపు తెచ్చుకుంది. 2019తో పోలిస్తే స్వల్పంగా తగ్గిన ఈ స్థాయిలో నిలవడం విశేషం. గడచిన మూడేళ్లుగా కొనసాగిస్తున్న కార్యక్రమాలే... పట్టణాన్ని ఈ స్థాయిలో నిలిపాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ యేడాది దక్షిణ భారత స్థాయిలో లక్షలోపు జనాభా కలిగిన వాటిలో 189 పురపాలక సంఘాలు స్వచ్ఛ సర్వేక్షన్-2020కి పోటీ పడ్డాయి. ఇందులో నర్సీపట్నం 28వ స్థానం దక్కించుకుంది. రాష్ట్రానికి సంబంధించి 40 పురపాలక సంఘాలు పోటీపడగా... అందులో ఇరవై రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. స్వచ్ఛ సర్వేక్షన్ పోటీల్లో మెరుగైన ర్యాంకు సాధించి నర్సీపట్నం అగ్రగామిగా నిలపాలని అధికారులు, నేతలు ముందు నుంచి ఆకాంక్షించారు. దీంతో గడచిన మూడేళ్లలో పట్టణంలో పరిశుభ్రత పాటించే ప్రదేశాలు పెరిగాయి. అధికారులు చేపట్టిన చర్యల కారణంగా... బహిరంగ మలవిసర్జన దాదాపు కనుమరుగైంది. వీధుల్లో చక్కని మరుగుదొడ్ల సదుపాయం కల్పించారు. తడి, పొడి చెత్త వేర్వురుగా సేకరిస్తున్నారు.

  • గతంలో రెండుసార్లు...

నర్సీపట్నం జనాభా ప్రస్తుతం 70 వేలకు పైగా ఉంది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి నర్సీపట్నం మూడుసార్లు స్వచ్ఛత అవార్డులను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రెండుసార్లు స్వచ్ఛ సర్వేక్షన్ కైవసం చేసుకుంది. గత మూడేళ్లలో 44, 23 స్థానాలను కైవసం చేసుకోగా... ప్రస్తుతం 28వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. రానున్న కాలంలో నర్సీపట్నం పురపాలక సంఘానికి మెరుగైన ర్యాంకు వచ్చేలా కృషి చేసేలా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ కనకరాజు హామీ ఇస్తున్నారు.

ఇవీ చదవండి:

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి 'స్వచ్ఛ కిరీటాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.