విశాఖ జిల్లా నర్సీపట్నం ఎక్సైజ్ స్టేషన్ పాతికేళ్లకు పైగా అద్దె భవనంలో నడుస్తోంది. సొంత భవనం లేకపోవటంతో అద్దె భవనంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అధికారులు తెలిపారు. గతంలో సొంత భవనం కోసం రెండు ఎకరాల స్థలం కేటాయించినప్పటికీ పనుల్లో పురోగతి లేదన్నారు. ఉన్న కొద్ది స్థలంలోనే వివిధ కేసుల్లో సీజ్ చేసిన 290 వాహనాలున్నాయన్నారు. మరో వైపు 21టన్నుల కిలోల గంజాయి నిల్వ ఉందన్నారు. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే ఇరుకుగా విధులను నిర్వహిస్తూ.. వాటిని పరిరక్షిస్తూ అవస్థలు పడుతున్నామని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి