నరెడ్కో స్తిరాస్థి ప్రదర్శన ...వైజాగ్లో! విశాఖలో స్థిరాస్తి కొనుగోలుదారుల కోసం భారీ ప్రాపర్టీ షో జరగనుంది. ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈ ప్రదర్శన నిర్వహించనుంది. మధురవాడలోని వైజాగ్-కన్వెన్షన్ లో జరగనున్న ఈ కార్యక్రమంలో వందకుపైగా కంపెనీలు పాల్గొంటాయని నిర్వాహకులు వెల్లడించారు. 5 వేలకుపైగా ఫ్లాట్లు, 50 వేల వరకు నివాస స్థలాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించనున్నారు. విశాఖపట్నంలో స్థిరపడాలనుకునే వారికి నరెడ్కో స్థిరాస్థి ప్రదర్శన అద్భుత అవకాశమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఇవీ చదవండి....మాంద్యానికి 'సీతమ్మ మందు'తో లాభాలివే!