విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం షేకిల్ల పాలెం గ్రామంలో నల్ల మారమ్మ తల్లి అమ్మవారి జాతర వైభవంగా జరిగింది. దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ ఆలయం వద్ద ప్రతియేటా వీటిని నిర్వహిస్తారు. అనేక ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
దేవాదాయ శాఖ ఇందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక్కడ చిలకల తీర్థం ప్రత్యేకతను సంతరించుకుంది. పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండి: