ETV Bharat / state

Nakka Anandbabu: 'అక్రమ మైనింగ్​పై అన్ని అధారాలు ఉన్నాయి'

విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దు మన్యంలో జరుగుతున్న అక్రమ మైనింగ్​పై తెదేపా వద్ద అన్ని అధారాలు ఉన్నాయని నక్కా ఆనంద్ బాబు స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్​పై రేపు న్యాయస్థానాల్లో నిలబడేది అధికారులేనని హెచ్చరించారు. వాస్తవాలను బయటికి తెలియజేస్తామనే తమపై అక్రమ కేసులు పెట్టారని అరోపించారు. అక్రమ మైనింగ్​పై గిరిజనులు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని ధ్వజమెత్తారు.

Nakka Anandababu
నక్కా ఆనంద్ బాబు
author img

By

Published : Jul 21, 2021, 1:13 PM IST

విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దు మన్యంలో జరుగుతున్న అక్రమ మైనింగ్​పై రేపు న్యాయస్థానాల్లో నిలబడేది అధికారులేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు హెచ్చరించారు. లాటరైట్ ముసుగులో జరుగుతున్న బాక్సైట్ అక్రమ మైనింగ్​కు సంబంధించి తెదేపా వద్ద పూర్తి స్థాయిలో అధారాలు ఉన్నాయని తెలిపారు. క్రిందిస్థాయిలో పర్యావరణ, అటవీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు కుమ్మక్కై అక్రమ మైనింగ్ ఆదాయాన్ని పంచుకునేందుకు సిద్ధపడ్డారా అని ప్రశ్నించారు.

ప్రణాళికబద్ధంగా రూ.15వేల కోట్లు కొల్లగొట్టేందుకు వైవీ సుబ్బారెడ్డి తనయుడి స్నేహితుడు లవ్ కుమార్ రెడ్డి ద్వారా అక్రమ మైనింగ్ చేయిస్తున్నారని నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. కంచె చేను మేసినట్లుగా ప్రభుత్వమే అడవులు నరుకుతుంటే అటవీ శాఖ అధికారులు చోద్యం చూశారని దుయ్యబట్టారు. అడవులు నరుకుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టుకు ఫిర్యాదు చేశామన్నారు. అక్రమ మైనింగ్​పై గిరిజనులు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని ధ్వజమెత్తారు. క్షేత్రస్థాయిలో తాము పరిశీలించిన వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకూడదనే.. ఆనాడు మీడియా సమావేశం అడ్డుకుని, కొవిడ్ నిబంధనలు అతిక్రమించామని తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.

ఇదీ చదవండి

Achenna: నిధులున్న కార్పొరేషన్లన్నీ సీఎం సొంత వర్గానికే: అచ్చెన్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.