కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు అత్యవసర సేవలందిస్తున్న వైద్యులు, పోలీసులు యుద్ధవీరులతో సమానమని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రిలోని నర్సులకు ఎన్-95 మాస్క్‌లు అందజేశారు. నగరంలోని చెస్ట్, గీతం, కింగ్ జార్జ్ ఆస్పత్రుల్లో వైద్య కిట్లు, ఎన్-95 మాస్క్‌లను పంపిణీ చేస్తున్నామని.. కరోనా మహమ్మారి ఉద్ధృతి తగ్గే వరకు భాజపా కార్యకర్తలు, నాయకులు తమ సేవలను కొనసాగిస్తారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా భాజపా వైద్య విభాగం రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆహార పొట్లాలను పేదలకు పంపిణీ చేశారు.
ఇదీచదవండి.