విశాఖ జిల్లా హుకుంపేట మండలం జంబువలసలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్లిన ప్రియుడు.. ఆమెను దారుణంగా హత్యచేశాడు. అయితే.. ఆమె అప్పటికే ఐదు నెలల గర్భవతి. దీంతో.. అన్యాయంగా రెండు ప్రాణాలు పోయినట్టైంది.
విశాఖ జిల్లా ఏజెన్సీలో నివసించే ఓ యువతి.. ఆనందరావు అనే యువకుడిని ప్రేమించింది. పెళ్లిచేసుకుంటానని నమ్మించిన ప్రియుడు అనందరావు.. శారీరకంగా దగ్గరయ్యాడు. దీంతో.. ఆమె గర్భవతి అయ్యింది. 5 నెలల గర్భవతైన సదరు యువతి.. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెంచింది.
ఈ క్రమంలో.. ఆమెను పెళ్లిచేసుకుంటానని నమ్మించిన నిందితుడు శనివారం యువతిని ఇంటి నుంచి తనతో తీసుకెళ్లాడు. ఊరి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి.. బండరాయితో మోది హత్యచేసినట్టు పోలీసులు తెలిపారు. ఆ తరువాత యువతి మృతదేహాన్ని దగ్గరలోని తుప్పల్లో పడేశాడు. యువతి మృతదేహాన్ని ఆలస్యంగా గుర్తించిన కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: