మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు రూ. 15 కోట్ల ఖర్చవుతుందని జీవీఎంసీ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌కు జీవీఎంసీ కమిషనర్ సృజన పంపారు. మార్చి 10న ఎన్నికలు, 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
ఎన్నికలకు అనుగుణంగా చేయాల్సిన ఏర్పాట్లు ఇతరత్రా అంశాలకు సంబంధించిన ఖర్చుల అంచనాలను జీవీఎంసీ అకౌంట్స్ విభాగం రూపొందించింది. మొత్తం రూ. 15 కోట్లు వరకూ అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.
ఇదీ చూడండి:
పోస్కో ఒప్పందంతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కే ముప్పు!