ETV Bharat / state

విశాఖ జిల్లాలో ఘనంగా ముక్కోటి ఏకాదశి పూజలు

విశాఖపట్నంలోని దేవాలయాలన్ని ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయాయి. జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు.

Breaking News
author img

By

Published : Dec 25, 2020, 2:33 PM IST

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని విశాఖపట్నం జిల్లావ్యాప్తంగా ఉన్న వైష్ణవ దేవాలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడాయి. చోడవరంలోని శ్రీ దేవి భూదేవి సమేత కేశవ స్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాలలో భక్తులకు ఉత్తర ద్వారం దర్శనం కల్పించారు. కేశవ స్వామి ఆలయంలో 21 రకాల ఫలాలతో గర్భగుడిని ఆలంకరించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. బుచ్చెయ్యపేట మండలం వడ్డాది కొండపై ఉన్న వెంకటేశ్వర స్వామిని... ఉత్తర ద్వారం ద్వారా భక్తులు దర్శించుకున్నారు.

అప్పన్న సేవలో...శారదా పీఠాధిపతి

శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి... సింహాచలంలో ప్రసిద్ధమైన వరాహ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఉత్తర ముఖంగా భక్తులకు దర్శనమిస్తున్న సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు, పండితులు స్వామీజీకి స్వాగతం పలికారు. వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోనికి తీసుకెళ్లారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని ఎలమంచిలి పట్టణంలో ఉన్న... వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వైకుంఠ ద్వారం ద్వారా స్వామికి... అభిషేకాలు నిర్వహించి, దర్శించుకున్నారు. ఈ మండలంలోని మరో పుణ్యక్షేత్రం ఏటికొప్పాక వేణుగోపాలస్వామి ఆలయం భక్తులతో రద్దీగా కనిపించింది. ముక్కోటి పర్వదినాని పురస్కరించుకుని గుడి వద్ద ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

జిల్లాలోని మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల్లో ఉన్న ఆలయాల్లో... వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఉత్తర ద్వారం దర్శనం కల్పించారు. నర్సీపట్నం మండలం, బలిఘట్టం సమీపంలోని ఉత్తర వాహిని నది తీరాన సత్యనారాయణ మూర్తి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామి వారిని పల్లకిలో ఊరేగించారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు.

అనకాపల్లిలో ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. దేముని గుమ్మం వెంకటేశ్వర స్వామి ఆలయంలో... ఉదయం నుంచి అధిక సంఖ్యలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. స్వామివారిని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, అనకాపల్లి ఆర్డిఓ సీతారామారావు, వైకాపా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

విశాఖ ఓల్డ్ టౌన్ లో ఉన్న వెంకటేశ్వర దేవాలయంలో వైకుంఠ ఏకదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి భక్తులు స్వామిని దర్శించుకున్నారు.

ఇదీ చదవండి: అప్పుల వలలో చిక్కొద్దు సుమీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.