ETV Bharat / state

ఎస్‌.ఎం.ఫ్యాబ్రికేషన్స్...నిర్మాణ రంగంలో నూతన ఒరవడి

author img

By

Published : Dec 25, 2020, 2:33 PM IST

వ్యాపార మార్గానికి కొత్త ఆలోచనలే కాదు...ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత వరకు రాణించగలం.. భవిష్యత్తు మనుగడ లాంటివి కూడా ముఖ్యమే. ఒక అంశంపై ఎంతో పరిశోధన చేసి అంచనాకు రావాల్సి ఉంటుంది. విశాఖకు చెందిన ఓ యువకుడు నూతన నిర్మాణరంగంలో తనదైన ముద్ర వేసేందుకు ఓ సంస్థను స్థాపించాడు. తక్కువ కాలంలోనే కోట్ల టర్నోవర్​తో కంపెనీ దూసుకుపోతోంది.

sm fabrications
నిర్మాణ రంగంలో ఎస్‌.ఎం.ఫ్యాబ్రికేషన్స్

విశాఖ నగరానికి చెందిన ఓ యువకుడు భవన నిర్మాణరంగంలో వస్తున్న మార్పులను గమనించి అందుకు అనుగుణమైన ఉత్పత్తులను తయారుచేస్తూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో కూడా తన ఉత్పత్తులను మార్కెట్‌ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

హైదరాబాద్‌కు చెందిన ఎం.పవన్‌కుమార్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు. కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌లో ఎం.టెక్‌ కూడా పూర్తిచేసి నిర్మాణరంగానికి చెందిన పలు మెలకువలను ఔపోసన పట్టాడు. క్షేత్రస్థాయిలో మంచి అనుభవం సాధించడం కోసం దిల్లీలోని ఐ.జె.ఎం. సంస్థలో రెండేళ్లపాటు సివిల్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తించాడు. అనంతరం తానే సొంతంగా ఎదగాలన్న ఉద్దేశంతో పలు సివిల్‌ నిర్మాణ బాద్యతలను కూడా విజయవంతంగా నిర్వహించాడు. యూరోప్‌ దేశాల్లో చెక్క, ఇనుప తలుపులు, కిటికీలకు బదులుగా యు.పి.వి.సి.(అన్‌ప్లాస్టిసైడ్‌ పాలీ వినైల్‌ క్లోరైడ్‌) ఉత్పత్తులను విస్తృతంగా ఉపయోగిస్తున్నారని గుర్తించాడు. ఆయా యు.పి.వి.సి. ఫ్రేములకు భారతదేశంలోనూ రానున్న రోజుల్లో గిరాకీ బాగా పెరుగుతుందని అంచనా వేశాడు. విశాఖలోని గాజువాక పారిశ్రామిక ప్రాంతం(ఐలా)లో ఎస్‌.ఎం.ఫ్యాబ్రికేషన్స్‌ అనే సంస్థను సుమారు రూ.45లక్షల పెట్టుబడితో ఏర్పాటుచేసి యూపీవీసీ కిటికీలు, తలుపులు తయారుచేయడం ప్రారంభించాడు. ఒక్క విశాఖపట్నం మార్కెట్‌కే పరిమితం కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో మార్కెట్‌ కూడా క్రమంగా ఊపందుకుంటుండడంతో అక్కడ కూడా తన ఉత్పత్తులు విక్రయించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోనూ విక్రయాలు జరుగుతుండడంతో సంస్థను విజయపథంలో నడిపించగలుగుతున్నాడు.

ఆటోమేషన్, రోబోటిక్‌ పరిజ్ఞానాల వినియోగం...

తన ఉత్పత్తుల నాణ్యతలో ఏమాత్రం రాజీపడకూడదన్న ఉద్దేశంతో గత సంవత్సరం జర్మనీ నుంచి అత్యాధునిక యంత్రాలను కూడా దిగుమతి చేసుకున్నారు. ఆటోమేషన్, రోబోటిక్‌ పరిజ్ఞానాలతో ఆయా యంత్రాలు పనిచేస్తాయి. కొనుగోలుదారులు ఎలాంటి డిజైన్లలో కిటీకీలు, తలుపులు కావాలంటే ఆ విధమైన డిజైన్లలో చేసి ఇవ్వగలుగుతున్నారు. నూతన యంత్ర వినియోగం కారణంగా ఏకంగా 121 రకాల డిజైన్లలో తన ఉత్పత్తులను తయారుచేసి అందించే వెసులుబాటు పవన్‌కుమార్‌కు కలిగింది. సంప్రదాయ విధానంలో మానవతప్పిదాల కారణంగా సంభవించే చిన్నచిన్న పొరపాట్లకు కూడా తావులేకుండా పూర్తి నాణ్యతతో ఆయా ఉత్పత్తులు తయారవుతున్నాయి.

40 మందికి ఉపాధి...

ఎస్‌.ఎం.ఫ్యాబ్రికేషన్స్‌ సంస్థలో ప్రస్తుతం 40 మంది ఉపాధి పొందుతున్నారు. ఆయన తన సంస్థ టర్నోవరును రూ.4కోట్లకు చేర్చగలిగారు. నూతన యంత్రం వినియోగించడానికి, ఉత్పత్తిని పెంచడానికి వీలుగా సంస్థను అగనంపూడి సమీపంలోని లక్కరాజుపాలెం గ్రామంలోని విశాల ప్రాంగణానికి మార్చారు.

పర్యావరణానికి, కొనుగోలుదారులకు అత్యంత ఉపయుక్తం...

యూపీవీసీ, గాల్వనైజ్డ్‌ ఐరన్‌ ఉపయోగించి ఆయా కిటికీలు, తలుపులను తయారుచేస్తున్నాం. చెక్క కారణంగా చెదపట్టడమే కాకుండా, చెక్కను వినియోగించడానికి వృక్షాలను నరికేయాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని యూరోపియన్‌ దేశాల్లో యూపీవీసీ ప్రేములనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. దేశంలోనూ ఇటీవలి సంవత్సరాల్లో వాటి వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ప్రేముల్లో తప్పుపట్టని ఇనుమును ఉపయోగిస్తుండడంతో వాటి బలం కూడా ఎక్కువగానే ఉంటుంది. నిర్వహణ ఖర్చులు తక్కువ. కొనుగోలు సంస్థల డిమాండును బట్టి విదేశాల నుంచి యూపీవీసీని దిగుమతి చేసుకుని అత్యంత నాణ్యమైన ప్రేములను అందిస్తుండడంతో మా ఉత్పత్తులకు మంచి ఆదరణే లభిస్తోంది. కొవిడ్‌ కారణంగా ఒకింత వ్యాపారం తగ్గినప్పటికీ మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నాం. దేశంలో అతితక్కువ మంది మాత్రమే ఆటోమేషన్, రోబోటిక్‌ పరిజ్ఞానాలను వినియోగించి తలుపులు, కిటికీలు తయారుచేస్తున్నారు. - ఎం.పవన్‌కుమార్, అధినేత, ఎస్‌.ఎం.ఫ్యాబ్రికేషన్స్‌

ఇదీ చదవండి: 'అంతర్జాతీయ ప్రమాణాలతో ప్లానిటోరియం మ్యూజియం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.