విశాఖ జిల్లా అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో ఎంపీ బీవీ సత్యవతి అధికారులతో సమావేశమయ్యారు. అనకాపల్లిలో కరోనా ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మెడికల్ పరంగా కావలసిన సదుపాయాలను.. అధికారులకు కావలసిన పరికరాలను అందించడానికి తాము సిద్దంగా ఉన్నామన్నారు. కరోనా వ్యాప్తి నివారణలో సీఎం జగన్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని కొనియాడారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడంతో పాటు రేషన్ సరకులు ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు. లాక్డౌన్కి ప్రజలు సహకారం అందిస్తున్నారంటూ అభినందించారు. ఏప్రిల్ 14 వరకు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. కరోనాని అరికట్టడానికి.. ప్రజలంతా పూర్తి సహకారం అందించాలని కోరారు.
ఇదీ చదవండి: లాక్డౌన్ వేళ పోలీసులే డెలివరీ బాయ్స్!