అమ్మే.. తన బిడ్డను అమ్మేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గోపాలపట్నంలో జరిగింది. జీవీఎంసీ 91వ వార్డు లక్ష్మీనగర్‌లో నివాసముంటున్న ఓ అవివాహిత (20) గత నెల 19న కేజీహెచ్‌లో మగశిశువుకు జన్మనిచ్చింది. తెలిసిన బంధువుల ద్వారా కొంత మొత్తానికి ఆ శిశువును ఎవరికో అమ్మేసి ఇంటికి వచ్చింది. ఈ విషయం ఐసీడీఎస్ అధికారులకు తెలిసి ఆమె ఇంటికి వచ్చి ఆరా తీశారు. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పగా... పోలీసులకు ఫిర్యాదు చేస్తామనడంతో వాస్తవాన్ని ఒప్పుకుంది. కొనుగోలు చేసిన వారి దగ్గర నుంచి బిడ్డను రప్పించి మర్రిపాలెం ప్రభుత్వ శిశుగృహం అధికారులకు అప్పగించినట్లు పెందుర్తి ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సిహెచ్.వంశీప్రియ తెలిపారు.
ఇదీ చదవండి: స్పందించని 104.. దిక్కుతోచని స్థితిలో విశాఖ వాసులు