విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఎన్జీవో కాలనీలో నివసిస్తున్న వరుణ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు వరుణ్‌కు చికిత్స అందించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆక్సిజన్ బెడ్ దొరకకపోవడంతో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు.
వరుణ్ కుమార్ తల్లి పద్మ సైతం కరోనా బారిన పడటంతో అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స అనంతరం డిశ్ఛార్జ్ చేశారు. అనంతరం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో... ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పడకలు లేక.. సరైన సమయంలో చికిత్స అందక పద్మ మరణించింది. ఆక్సిజన్ పడకలు లభించకపోవడం వల్లే తల్లీ, కుమారుడు మృతి చెందారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: