ఓ తల్లి తన రెండేళ్ల కుమారుడితో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది. భీమునిగుమ్మంలో నివాసముంటున్న దుప్పాడ సునీత తన రెండున్నరేళ్ల హృదయ్‌తో కలిసి పెట్రోల్ పొసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేశారు. అప్పటికే తల్లి, కూమారుడు 80 శాతానికి పైగా కాలిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరిని చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. కుటుంబ కలహాలతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: