విశాఖలో గత వారం 800 పైనే కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే రికవరీ రేటు ఆశాజనకంగా ఉండడం, మరణాల సంఖ్యను తగ్గిచడమే లక్ష్యంగా వైద్యులు పనిచేస్తున్నారు. కొత్త కేసుల పెరుగుదల మరికొన్ని రోజులపాటు ఇలాగే ఉంటుందని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొవిడ్ పట్ల అవగాహనతో ఉండడం వల్ల ఎక్కువమందికి పరిస్థితి విషమించకుండా ఉంటుందని వారు చెబుతున్నారు.
ఇప్పటికే విశాఖ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 30 వేలు దాటింది. మరణాల సంఖ్య సగటున 5 నుంచి 7 శాతంగా ఉంది. మరణాల సంఖ్య తగ్గించడమే లక్ష్యంగా పనిచేసేందుకు మరిన్ని ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వచ్చేది శీతాకాలం కావడం, సాగర తీరంలో ఉండడం వలన విశాఖలో సాధారణ రోజుల్లోనే శ్వాసకోశ వ్యాధులు ఎక్కువ. అందుకే కొవిడ్ విషయంతో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
విశాఖ నగరంలో 17 ఆసుపత్రులు కొవిడ్ బాధితులను చికిత్స అందిస్తున్నాయి. రాష్ట్ర కొవిడ్ ఆసుపత్రిగా విమ్స్‌పై భారం తగ్గించేందుకు కేజీహెచ్‌లోని కొత్త బ్లాకులో కరోనాకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఎక్కువమందికి లక్షణాలు లేకుండా పాజిటివ్ వస్తున్నందున ఇంటి వద్దనే ఐసోలేషన్‌లో ఉంది మందులు వాడితో సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. భౌతిక దూరం పాటించడం, ఇతర జాగ్రత్తలు తప్పకుండా ఆచరించాలని సూచించారు.
ఇవీ చదవండి..