ETV Bharat / state

యూనియన్​ బ్యాంకులో చోరీ... పోలీసుల విచారణ

author img

By

Published : Sep 29, 2019, 11:41 PM IST

విశాఖ మన్యం జి.మాడుగుల మండలంలోని యూనియన్​ బ్యాంకులో చోరీ జరిగింది. నగదు ఎంత పోయిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

బ్యాంకులో చోరీ
యూనియన్​ బ్యాంకులో చోరీ... పోలీసుల విచారణ

విశాఖ మన్యం జి.మాడుగుల మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్​లో చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు గ్యాస్ కట్టర్​తో షట్టర్లు కోసి లోనికి ప్రవేశించి... లాకర్లు తొలగించారు. ఆదివారం సాయంత్రం స్థానికుల సమాచారంతో సిబ్బంది, పోలీసులు బ్యాంకుకు చేరుకుని పరిశీలించారు. నగదు ఎంత పోయిందనే వివరాలు తెలియాల్సి ఉంది. సోమవారం క్లూస్​ టీం వచ్చి ఆధారాలు సేకరించనుంది.

ఇదీ చూడండి:

ఎలక్ట్రానిక్ వస్తువులే లక్ష్యంగా దోపిడీ.. ఇద్దరి అరెస్ట్

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

ముస్లింల ప్రార్థన మందిరాలు, హిందు దేవాలయాల సమీపంలో మద్యం దుకాణం.
మద్యం షాపును తొలగించాలని మహిళల అందోళన.

ఉరవకొండ పట్టణంలో ఈ రోజు స్థానిక కమన్న కట్ట వీధిలో మద్యం షాపును తొలిగించాలని మహిళలు ఆందోళన నిర్వహించారు, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మద్యపాన నిషేధం పథకం లో భాగంగా ప్రైవేట్ మద్యం షాపులను తొలగించి ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తుంది, అయితే ఈ పథకం ప్రవేశపెట్టిన నాటి నుండి రాష్ట్రంలో కొన్ని చోట్ల ప్రభుత్వ మద్యం దుకాణాలు నివాసాల మధ్య నిర్వహిస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఈ క్రమంలొనే ఉరవకొండ పట్టణంలో హిందు, ముస్లిం ప్రజలు అధిక సంఖ్యలో ఉండే కామన్న కట్ట ప్రాంతంలో గత కొన్ని రోజుల నుండి ప్రభుత్వం మద్యం దుకాణాన్ని నిర్వహిస్తుంది, ఈ మద్యం దుకాణం ఎదురుగానే శివాలయం, దర్గా ఉండటం ప్రార్ధన మందిరాలు వెళ్లే భక్తులకు అసౌకర్యంగా ఉందని స్థానికులు వాపోతున్నారు, అంతే కాకుండా ఈ మార్గం గుండా ప్రతి రోజు బాలికల పాఠశాలలకు వెళ్లే ఎంతో మంది విద్యార్థునులు, ఉపాధ్యాయినులు వెళ్తుంటారు, మద్యం దుకాణం ఏర్పాటుయినప్పటి నుండి వారు పాఠశాలకు వెళ్ళిరావటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, మద్యం సేవించిన వారు తమ ఇళ్ల ముందుకు వచ్చి దుర్భాశలాడుతూ, పరిసరాలను అశుభ్రంగా తయారుచేసి వెళ్తున్నారని స్థానిక ప్రజలు తెలిపారు. స్థానిక మహిళల ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్యం దుకాణం ముందు మహిళలు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించి మద్యం షాపులోని సిబ్బందిని బయటికి పంపి షాపుకి తాళాలు వేశారు,అక్కడికి చేరుకున్న ఎక్ససైజ్ SI సత్యనారాయణ ఆందోళనకారులతో మాట్లాడుతూ ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు..Body:బైట్స్ : స్థానిక మహిళలు.Conclusion:Contributor : B. Yerriswamy
Center : uravakonda, ananthapuram (D)
Date : 29-09-2019
Sluge : ap_atp_71_29_mahilala_dharna_AVB_AP10097
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.