తెదేపా అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా విశాఖలో నందమూరి అభిమానులకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆర్థిక సహాయం అందించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలోని సుమారు 25 మంది నిరుపేద కుటుంబాలకు రూ.2 వేలు చొప్పున మొత్తం రూ.50 వేలు అందించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు సహాయం అందించిన ఎమ్మెల్యేకు నందమూరి అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి..