ETV Bharat / state

'నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా'

author img

By

Published : Nov 10, 2020, 5:34 PM IST

చోడవరం నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. రోలుగుంట మండలం కుసర్లపూడిలో ఏర్పాటైన రచ్చబండ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

rachabanda at kusarlapudi in visakha
నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా

ఇంటింటికి తాగునీరు అందించే కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గానికి రూ.104 కోట్లు మంజూరయ్యాయని స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. నియోజకవర్గంలోని రోలుగుంట, రావికమతం, బుచ్చయ్యపేట, చోడవరం మండలాల్లోని ప్రతి ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేస్తామన్నారు. రోలుగుంట మండలం కుసర్లపూడిలో ఏర్పాటైన రచ్చబండ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కుసర్లపూడి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, స్థానిక శ్రీదేవి పెద్దింటమ్మ ఆలయాల అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ధర్మశ్రీ వెల్లడించారు.

అంతకుముందు రోలుగుంట నుంచి కుసర్లపూడి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా వైకాపా శ్రేణులు.. బాణాసంచా కాల్చారు. పూలమాలలతో ఆయనకు స్వాగతం పలికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల పార్టీ అధ్యక్షులు మడ్డు అప్పలనాయుడు, ఇతర నాయకులు, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

కృష్ణాయపాలెం రైతుల బెయిల్ పిటిషిన్ రేపటికి వాయిదా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.