రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించటం పట్ల వైకాపా ఎమ్మెల్యే అమర్నాథ్ హర్షం వ్యక్తం చేశారు. పాలన రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలు, వనరులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. గత పాలకులు విశాఖ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ పాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని గ్రహించి మూడు రాజధానుల ఏర్పాటుకు పూనుకున్నారన్నారు. రాష్ట్రభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్షాలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు.
ఇదీచదవండి