ETV Bharat / state

బండారు అక్రమాలు ఆధారాలతో బయటపెడతా: ఎమ్మెల్యే అదీప్ రాజా - ఎమ్మెల్యే అదీప్ రాజా తాజా వార్తలు

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అక్రమాలు ఆధారాలతో సహా బయటపెడతానని పెందుర్తి శాసనసభ్యుడు అదీప్ రాజా వెల్లడించారు. తాను ఏ అక్రమాలకు పాల్పడకపోయినా...అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

బండారు అక్రమాలు ఆధారాలతో బయటపెడతా
బండారు అక్రమాలు ఆధారాలతో బయటపెడతా
author img

By

Published : Jan 17, 2021, 8:54 PM IST

Updated : Jan 17, 2021, 9:05 PM IST

బండారు అక్రమాలు ఆధారాలతో బయటపెడతా

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పెందుర్తి శాసన సభ్యుడు అదీప్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ అక్రమాలకు పాల్పడలేదని.. బండారు ఆరోపిస్తున్నట్లు ఖరీదైన అతిథి గృహాలు లేవని వెల్లడించారు. ఒకవేళ సర్వే నంబర్ 464లో అతిథి గృహాలు ఉన్నట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని..లేకపొతే బండారు రాజకీయాల నుంచి తప్పుకోవాలని సవాల్ విసిరారు.

కేవలం ఆరు ఎకరాల భూమి ఉంటే వందల ఎకరాలు ఉన్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే బండారు అక్రమాలు ఆధారాలతో సహా బయటపెడతానని వెల్లడించారు.

ఇదీచదవండి

సీఎం జగన్ డైరెక్షన్​లో డీజీపీ మాట్లాడుతున్నారు: దేవినేని

Last Updated : Jan 17, 2021, 9:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.