రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న చక్కెర కర్మాగారాల స్థితిగతులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తాము పర్యటిస్తునట్లు... మంత్రులు కురసాల కన్నబాబు, మేకపాటి గౌతమ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ తెలిపారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న తాండవ, ఏటికొప్పాక చక్కెర కర్మాగారాలను మంత్రుల బృందం పరిశీలించింది. రైతులు, కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చక్కెర కర్మాగారాన్ని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు తీసుకోవలసిన చర్యలపై సూచనలు, సలహాలు స్వీకరించారు.
షుగర్ ఫ్యాక్టరీలను కొనసాగించి తమ కుటుంబాలను ఆదుకోవాలని అధిక శాతం మంది రైతులు, కార్మికులు కోరారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ... గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే చక్కెర కర్మాగారాలు నష్టాల ఊబిలో చిక్కుకుపోయాయని ఆరోపించారు. రైతులకు మేలుచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అనంతరం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు, కార్మికులకు పూర్తిస్థాయి న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ...