ETV Bharat / state

కొవిడ్​ కేర్​ సెంటర్​ ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు - minister mutthamsetti srinivas latest news

విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఐఎన్​ఎస్​ కళింగ సిబ్బంది సహకారంతో ఏర్పాటు చేసిన కొవిడ్​ కేర్​ సెంటర్​ను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. ప్రజలంతా స్వచ్ఛందంగా కొవిడ్​ నిబంధనలు పాటించాలని కోరారు.

minister mutthamshetti srinivasa rao
కొవిడ్​ కేర్​ సెంటర్​ను ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు
author img

By

Published : May 11, 2021, 10:53 PM IST

విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఐఎన్​ఎస్​ కళింగ సిబ్బంది సహకారంతో కొవిడ్​ కేర్​ సెంటర్​ను ఏర్పాటు చేశారు. దానిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు భీమిలి ప్రభుత్వాస్పత్రి డాక్టర్ల పర్యవేక్షణలో 60 పడకలతో పాటు 16 ఆక్సిజన్​ బెడ్లు ఏర్పాటు చేశామని చెప్పారు.

అన్ని సదుపాయాలతో కొవిడ్​ కేర్​ సెంటర్​ను ఏర్పాటు చేసిన కళింగ నేవీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలంతా స్వచ్ఛందంగా కొవిడ్​ నిబంధనలు పాటించాలని కోరారు. ఐఎన్​ఎస్​ కళింగ చీఫ్​ కమాండర్​ నీరజ్​ ఉదయ్​, డీఎంహెచ్​వో సూర్యనారాయణ, నాల్గవ వార్డు కార్పొరేటర్​ దౌలపల్లి కొండబాబు, భీమిలి హెల్త్ ఆఫీసర్ సిద్దార్థ్, వైద్యాధికారులు, నేవీ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

మరో 2 నెలల్లో అదుపులోకి కరోనా... జులై 15 నాటికి 100 లోపు కేసులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.