ETV Bharat / state

'విశాఖ ఉత్సవ్​'తో  పర్యటకాన్ని విస్తృత పరుస్తాం: మంత్రి ముత్తంశెట్టి - latest news on visakha utsav

విశాఖ ఉత్సవ్​ను దక్షిణ భారతదేశంలోనే మెగా ఈవెంట్​గా నిర్వహించి...జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్యటకాన్ని ఆకర్షిస్తామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి... గవర్నర్, సీఎం ముఖ్యఅతిథులుగా హాజరవుతారని మంత్రి పేర్కొన్నారు.

విశాఖ ఉత్సవ్​పై మంత్రి ముత్తంశెట్టి వ్యాఖ్యలు

author img

By

Published : Nov 26, 2019, 6:42 AM IST

విశాఖ ఉత్సవ్​పై మంత్రి ముత్తంశెట్టి వ్యాఖ్యలు

దక్షిణ భారతదేశంలోనే ఒక మెగా ఈవెంట్​గా విశాఖ ఉత్సవ్​ను నిర్వహిస్తామని పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. డిసెంబరు 28, 29 తేదీల్లో జరగనున్న విశాఖ ఉత్సవ్ పోస్టర్లను మంత్రి ముత్తంశెట్టి, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాసరావు విడుదల చేశారు. విశాఖ ఉత్సవ్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్యటకాన్ని ఆకర్షిస్తామని వెల్లడించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు. స్థానిక కళాకారులు, ప్రజలకు భాగస్వామ్యం కల్పించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు. భీమిలి ఉత్సవ్​ను విజయవంతం చేసిన స్ఫూర్తితోనే మరింత ఆకర్షణీయంగా విశాఖ ఉత్సవ్​కు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆర్కే బీచ్​లోని ప్రధాన వేదికతో పాటు నోవాటెల్ ఎదురుగా ఉన్న ప్రదేశంలో జాతర, వైఎస్ఆర్ సెంట్రల్ పార్కులో మరో వేదిక ఉంటుందని మంత్రి తెలిపారు.

ఇదీ చూడండి:ఆంధ్ర వైద్య కళాశాల.. వివిధ రాష్ట్రాల విద్యార్థులకు వేదిక!

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.