విశాఖ జిల్లా ఆనందపురం మండల కేంద్రంలో రూ.6 లక్షల వ్యయంతో నిర్మించిన కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని మంత్రి అవంతి శ్రీనివాసరావు(Avanthi srinivasa rao) ప్రారంభించారు. అనంతరం 236 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికీ రూ.1500 విలువైన నిత్యావసర సరుకులు మంత్రి అవంతి శ్రీనివాసరావు పంపిణీ చేశారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని... వారి సేవలను కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు సమకూర్చిన ఎంపీడీవో లవరాజు, సిబ్బందిని అభినందించారు.
ఇదీ చదవండి