ETV Bharat / state

ఆకట్టుకుంటున్న అర్ధరాత్రి జిమ్​లు

మీ స్నేహితుల్లో ఎవరినైనా మీ జిమ్​ టైమింగ్స్ ఏంటి అని అడగండి టక్కుమని ఉదయం లేదా సాయంత్రం అని చెప్పేస్తారు. కానీ విశాఖపట్నం వాసులు మాత్రం ఏ రాత్రి పదో, అర్ధరాత్రి రెండో అని చెబుతారు. అదేంటని ఆశ్చర్య పోతున్నారా? మీరు విన్నది నిజమే. ఎందుకంటే ఇక్కడ అర్ధరాత్రి జిమ్​లకు ఉన్న క్రేజ్​ వేరు. దీంతో ఈ జిమ్​లకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. అసలు ఆ జిమ్​ల ప్రత్యేకత ఏంటి? దీనిపై విశాఖ వాసులు ఏం చెబుతున్నారు అనే అంశాలపై ఈటీవీ భారత్​ అందిస్తున్న ప్రత్యేక కథనం.

author img

By

Published : Dec 25, 2020, 2:10 PM IST

Updated : Dec 25, 2020, 2:28 PM IST

midnight gyms in visakhapatnam
ఆకట్టుకుంటున్న అర్ధరాత్రి జిమ్​లు

ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే జిమ్‌లకు వెళ్లాలనుకునే సంస్కృతి క్రమంగా మారి.. ఖాళీ దొరికితే జిమ్‌కు వెళ్లే వారి సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. అర్ధరాత్రి వేళల్లోనూ పారిశ్రామిక నగరం విశాఖలో పలు ఐటీ, పారిశ్రామిక సంస్థలు నిరంతరాయంగా పనిచేస్తుంటాయి. పలువురు ఉద్యోగులు మూడు షిఫ్టుల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నారు. అలాంటి వారు వారి షిఫ్టులకు అనుగుణంగా ఇతర కార్యక్రమాలను నిర్వర్తించుకోవాల్సి వస్తోంది. వృత్తిపరమైన, వ్యక్తిగతమైన కారణాలతో ఉదయం నుంచి రాత్రి వరకు తీవ్రమైన పనిఒత్తిడిలో ఉండేవారు కూడా ఆరోగ్య పరిరక్షణ కోసం రాత్రి పది గంటల దాటిన తరువాత కూడా జిమ్‌లకు వెళ్తున్నారు. ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు కనీసం గంటపాటైనా వ్యాయామం చేయడం అవసరమని అత్యధికులు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అర్ధరాత్రి సమయాల్లో కూడా జిమ్‌లు పుట్టుకొచ్చాయి.

విశాఖపట్నంలో సుమారు 150 జిమ్​లు ఉండగా.. వాటిలో 30వేలకు పైగా రోజు వ్యాయామాలు చేస్తున్నారు. అయితే ఇందులో కొన్ని జిమ్​లు రాత్రి పది దాటిన తరువాత కూడా వ్యాయామాలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. సుమారు 150 మందికి పైగా నగరవాసులు రాత్రి వేళల్లో వ్యాయామాలు చేస్తున్నారు.

ఆకట్టుకుంటున్న అధునాతన ఉపకరణాలు:

జిమ్​ యాజమాన్యాలు అత్యాధునిక ఉపకరణాలతో వ్యాయామాలు చేసేవారిని ఆకట్టుకుంటున్నాయి. దీంతో జిమ్​ వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శరీరానికి తగినట్టుగా ఉపకరణాలను జిమ్​ యాజమాన్యం ఏర్పాటు చేస్తున్నారు. జిమ్‌కు వచ్చేవారి వయస్సు, ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వారికి ఉపయుక్తంగా ఉండే తేలికపాటి వ్యాయామాలనే తొలుత సాధన చేయిస్తున్నారు. జిమ్‌లలోని శిక్షకులు కేవలం వివిధ వ్యాయామాలను సాధన చేయించడమే కాకుండా ఆరోగ్యానికి అవసరమైన పోషక విలువలున్న ఆహారం తీసుకోవడంపైనా చక్కటి సలహాలు సూచనలు ఇస్తున్నారు. వ్యాయామం చేయడానికి అవసరమైన శక్తిసామర్థ్యాలు వారిలో పెంచడానికి కృషిచేస్తున్నారు.

జిమ్​ సమయంతో వ్యసనాలకు దూరం:

శరీరం కొంతకాలంపాటు వ్యాయామాలకు అలవాటు పడితే తరువాత రోజుల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. జిమ్‌లకు వెళ్లడంగానీ, ఇతర శారీరక వ్యాయామాలపై దృష్టిసారించిన వారికి ఆరోగ్య స్పృహ పెరిగి మద్యం, సిగరెట్టు వంటి హానికర అలవాట్లకు కూడా దూరమవుతున్నామని కొందరు చెప్తున్నారు. వ్యసనాలకు దూరమయ్యే అవకాశం.. ఖాళీ సమయాల్లో బార్లు, పబ్‌లకు వెళ్లడం, సిగరెట్లతో కాలక్షేపం చేయడం కన్నా శరీరారోగ్యాన్ని పెంచే జిమ్‌కు వెళ్తే ఆరోగ్యానికి అత్యంత ఉపయుక్తంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అందుకు ఏ సమయంలోనైనా కొద్ది సేపు వ్యాయామం చేస్తే దీర్ఘకాలంలో ప్రయోజనం ఉంటుందని.. వ్యసనాలకు దూరమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

వేలి ముద్రలతో జిమ్​లోకి ప్రవేశం

అర్ధరాత్రుల్లో జిమ్‌లకు వచ్చేవారి కోసం జిమ్‌ యజమానులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. రాత్రి వేళల్లో జిమ్​లోకి ఇతర వ్యక్తులు ప్రవేశించకుండా వేలిముద్ర ద్వారా తాళం తెరుచుకునే ఏర్పాట్లు చేశారు. రాత్రి సమయాల్లో జిమ్‌లకు వెళ్లే వారు తమ వేలిముద్ర ఆధారంగా లోనికి వెళ్లి వ్యాయామం పూర్తైన తరువాత బయటకు వచ్చి తాళం వేసి వెళ్లిపోవచ్చు.

24 గంటలు అందుబాటులో ఉంచుతున్నాం..

కొందరు వ్యక్తిగత శిక్షకుల్ని నియమించుకుని శరీరంలోని ఏ భాగం ఎలాంటి ఆకృతి రావాలని కోరుకుంటున్నారో అందుకు అవసరమైన శిక్షణ పొందుతున్నారు. ఊబకాయం, ప్రత్యేకించి పొట్ట తగ్గించుకోవడానికి ప్రత్యేక శిక్షణ పొందుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా 40ఏళ్లు దాటిన తరువాత కూడా జిమ్‌లలో చేరి సాధన మొదలు పెడుతున్నారు. ఇలాంటి వారికోసం 24 గంటలు శిక్షణ ఇస్తున్నాం.

- ఎల్‌.మోహనరావు, జిమ్‌ యజమాని

గంటపాటు వ్యాయామం చేస్తే చాలు..

అర్ధరాత్రిళ్లు కూడా చక్కగా వ్యాయామాలు చేసుకోవచ్చు. తెల్లవారుజాము రెండు గంటలకు షిఫ్టు దిగి నేరుగా జిమ్‌కు వచ్చి ఒక గంటపాటు వ్యాయామం చేసుకునేవారు పెరుగుతున్నారు. రాత్రి పది దాటిన తర్వాత ఏదో ఒక సమయంలో కనీసం గంటపాటు వ్యాయామం చేస్తే అనారోగ్యాల బారిన పడకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

_మహేశ్, శిక్షకుడు

పోలీసులకు దేహదారుఢ్యం అత్యంత కీలకం..

విధుల్లోకి చేరినప్పటి నుంచి రోజు గంటన్నరపాటు వ్యాయామాలు చేస్తున్నా. ఉదయం వేళల్లో వృత్తిపరమైన బాధ్యతల కారణంగా సమయం చిక్కడంలేదు. దీంతో రాత్రి 9.30 గంటల నుంచి 11 గంటల వరకు జిమ్​కి వెళ్తున్నా. పోలీసులకు దేహదారుఢ్యం ఉంటే వృత్తిపరంగా మంచి ప్రయోజనాలుంటాయి.

- శంకర్‌రావు, హెడ్‌కానిస్టేబుల్

రాత్రివేళల ప్రశాంతంగా ఉంటుంది..

పోలీసుశాఖలో ఉద్యోగం అంటే ఆసక్తి. చదువుకునే రోజుల నుంచే వ్యాయమాలు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో జిమ్‌లో చేరా. రాత్రి పది దాటిన తరువాత తక్కువ మంది ఉంటారు కాబట్టి ప్రశాంతంగా వ్యాయామాలు చేసుకోవచ్చు.

- గణేశ్, బీటెక్ విద్యార్థి

శరీరానికి వ్యాయామం చాలా అవసరం..

శరీరానికి వ్యాయామం చాలా అవసరమని నేను భావిస్తా. ఉద్యోగ విధులు పూర్తిచేసుకుని ఇంటికి వచ్చే సరికి రాత్రి పది అవుతుంది. కనీస శారీరక వ్యాయామం లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ప్రతిరోజూ రాత్రి పది గంటలు దాటిన తరువాత కూడా ఏమాత్రం ఇబ్బందిపడకుండా.. ఒక గంట సమయాన్ని జిమ్​కు కేటాయించుకుంటున్నా.

- అప్పలరాజు, ఫార్మా ఎగ్జిక్యుటివ్‌

ఇదీ చదవండి: విశాఖ బీచ్​ రోడ్డులో భూగర్భ మార్గం..తీరనున్న ట్రాఫిక్​ సమస్యలు

Last Updated : Dec 25, 2020, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.