ETV Bharat / state

రీకౌన్సెలింగ్ కోరుతూ మిడిల్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ల ధర్నా

మిడిల్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ నియామకాల్లో జోన్​ల కేటాయింపును తిరిగి చేపట్టాలని డిమాండ్ చేస్తూ... విశాఖపట్నం జిల్లా డీఎంహెచ్​ఓ ఎదుట రెండవ బ్యాచ్ సిబ్బంది నిరసన చేపట్టారు. మిగతా రెండు బ్యాచ్​లను వారి చిరునామాకు 50 కిలోమీటర్ల లోపే నియమించి.. తమను సుదూర ప్రాంతాల్లో వేశారంటూ మండిపడ్డారు.

mlhps protests
నిరసన వ్యక్తం చేస్తున్న ఎంఎల్​హెచ్​పీలు
author img

By

Published : Dec 2, 2020, 7:41 PM IST

ఉద్యోగ నియామకాల కౌన్సెలింగ్​లో అవకతవకలు జరగడం వల్ల ఆ ప్రక్రియను తిరిగి నిర్వహించాలంటూ.. మిడిల్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ రెండవ బ్యాచ్ సిబ్బంది నిరసనకు దిగారు. విశాఖపట్నం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మెరిట్ ర్యాంకులు సాధించినప్పటికీ... తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

అసలేం జరిగింది ?

ఐదువేల జనాభా ప్రాతిపదికన హెల్త్, వెల్​నెస్ కేంద్రాలలో మెరుగైన వైద్యం అందించేందుకు.. ప్రభుత్వం ఒప్పంద పద్ధతిలో మిడిల్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018లో అధికారులు పరీక్ష నిర్వహించి నియామకాలు చేపట్టారు. ఈ ప్రక్రియ పూర్తిగా జోనల్ ప్రకారం జరుగుతుందని నోటిఫికేషన్​లో పేర్కొన్నారు. మొత్తం 1,400 పోస్టుల భర్తీకి ఒకేసారి కౌన్సిలింగ్ నిర్వహించడం సాధ్యం కాక మూడు బ్యాచ్​లుగా విభజించారని సిబ్బంది తెలిపారు.

మొదటిసారి మభ్యపెట్టారు...

మొదటి బ్యాచ్ వారికి పోస్టింగ్ ఇచ్చినా.. నిబందనలకు విరుద్ధంగా రెండో విడత కౌన్సిలింగ్​కూ అనుమతించారు. ఈ విధంగా వారికి స్థానిక ప్రదేశాల్లో ఉద్యోగం ఇచ్చారు. ఈ విషయంపై రెండోబ్యాచ్ సిబ్బంది అభ్యంతరం తెలపగా.. వారికీ ఇలాంటి అవకాశమే కల్పిస్తామని గుంటూరు రీజనల్ మెడికల్ డైరెక్టర్ మభ్య పెట్టారని బాధితులు పేర్కొన్నారు.

రెండోసారీ మొండిచేయి:

కరోనా వల్ల లాక్‌డౌన్‌ అమలులో ఉన్నందున మూడో బ్యాచ్ సిబ్బందికి.. వారి ఆధార్ కార్డులో ఉన్న చిరునామాకు 50 కిలోమీటర్ల దూరంలోనే ఉద్యోగాలు ఇచ్చారు. తమను మాత్రం వందల కిలోమీటర్ల దూరంలో నియమించారని నిరసనకారులు మండిపడ్డారు. ప్రతిభ ఉన్నా కౌన్సెలింగ్​లో అన్యాయం జరిగి.. కుటుంబ సభ్యులకు దూరమై ఆందోళనకు గురవుతున్నామని వాపోయారు. సీఎం జగన్ ఏర్పాటు చేయనున్న 'విలేజ్ క్లినిక్​'లోనైనా.. ఏ జోన్ అభ్యర్థులకు ఆ జోన్లలోనే పోస్టింగ్ ఇచ్చి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

ఒంటరిగా వచ్చి...వెయ్యిమందికి దారి చూపి!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.