మతంతో రిజర్వేషన్ల అంశాన్ని ముడి పెట్టకుండా.. కులాన్ని మాత్రమే గుర్తించి చట్టం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జె.ప్రభాకర్ కోరారు. విశాఖపట్నం అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. అంటరానితనం, దోపిడీ, బానిసత్వానికి గురవుతున్న ఎస్సీ, ఎస్టీలకు కుల ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభాకర్ కోరారు.
103వ రాజ్యాంగ సవరణ ద్వారా కుల ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేసిన కేంద్రం.. ఇదే సూత్రాన్ని దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు వర్తింపజేయలేరా అని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వెంకట్రావు ప్రశ్నించారు. రాజ్యాంగం నిర్దేశించిన మత స్వేచ్ఛకు రక్షణ కల్పించాలని, మద్రాసు హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.