మెప్మా ప్రాజెక్టులో పనిచేస్తున్న మహిళా రిసోర్స్ పర్సన్స్‌ను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవమానించారని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్ కామేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీ పరిధిలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్స్‌కు 14 నెలలుగా వేతనాలు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా పనిచేస్తున్న రీసోర్స్పర్సన్స్ను తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆమె ఖండించారు. సమస్యలు చెప్పుకునేందుకు మంత్రి కార్యాలయానికి వెళ్లిన తమపై.. మంత్రి దురుసుగా ప్రవర్తించారని, పోలీసులు అసభ్యకరంగా వ్యవహరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి శ్రీనివాసరావు తమకు క్షమాపణ చెప్పాలని, అసభ్యకరంగా ప్రవర్తించిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని కోరారు.
ఇదీచదవండి.